కోరుట్ల(జగిత్యాల): పట్టణంలో సోమవారం రాత్రి భారీ దొంగతనం జరిగింది. స్థానిక ప్రకాశం రోడ్డులో నివాసం ఉండే రాజేంద్రప్రసాద్ సోమవారం కుటుంబసభ్యులతో పాటు హైదరాబాద్ వెళ్లారు. తిరిగి మంగళవారం వేకువజామున ఇంటికి చేరుకున్నారు. వారు వెళ్లేసరికి ఇంటి తాళాలు పగులగొట్టి ఉన్నాయి.
ఇంట్లో చూడగా బీరువాలోని 20 తులాల బంగారు ఆభరణాలు, రూ.50వేల నగదు కనిపించలేదు. గుర్తు తెలియని దుండగులు తన ఇంట్లో రూ.6.50 లక్షల విలువైన అభరణాలను ఎత్తుకుపోయారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై కృష్ణకుమార్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.